Wednesday, 11 December 2013

తలమీద షడగోప్యం పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది ?

తలమీద  షడగోప్యం పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది ?

       దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్ధం,  షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.
       కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. షడగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరిక షడగోప్యం. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్ధం.

No comments:

Post a Comment