Thursday 11 September 2014

చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు ?


     ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గంలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు.

సేకరణ: ఆదివారం సాక్షి పుస్తకం

Sunday 7 September 2014

దిష్టి ఎందుకు తీస్తారు ?

దిష్టి ఎందుకు తీస్తారు ?

      చిన్నపిల్లలకి ఏదైనా అనారోగ్యం కల్గినప్పుడు 'ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో' అంటూ గబ గబా దిష్టి తీసేస్తుంటారు. కొన్ని సందర్భాలలో పెద్దలకు కూడా తీస్తుంటారు. నిజానికి అలాంటిదేమీ ఉండదు. దిష్టి అనేది దృష్టికి వికృతి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని సూటిగా చూసినప్పుడు వారి నుంచి విద్యుత్ తరంగాలు వచ్చి శరీరాన్ని తాకుతాయనీ, ఒక వేళ  ఆ తరంగాలు వారి శరీరానికి హాని కలిగించేవి కనుక అయితే తల తిరగడం, కడుపులో తిప్పి వాంతులవడం లాంటివి జరుగుతాయని ఓ నమ్మకం. దాంతో దిష్టి తగిలిందని  అంటారు. అందుకే దిష్టి తీసిన నీళ్ళను అందరూ తిరిగే చోట వేయరు. ఎవరైనా తొక్కితే మళ్ళీ వారికి అనారోగ్యం కలుగుతుందని భయం.



సేకరణ : సాక్షి పుస్తకం నుంచి

Friday 5 September 2014

బాసికం ఎందుకు కడతారు ?

బాసికం ఎందుకు కడతారు ?

వివాహ ఘట్టంలో వధూవరుల అలంకరణలో బాసికం ఒక ప్రధానభాగం. అయితే దీన్ని ఎదుకు కడతారు అన్నది చాలా మందికి తెలియదు. ఈ ఆచారం వెనుక ముఖ్యమైన కారణం ఉంది.
    వివాహానికి అత్యంత అవసరమైనది సుముహూర్తం. సరిగ్గా ఈ ముహూర్తంలో వధువు కనుబొమలమధ్య స్థానాన్ని, అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అయితే పెళ్ళి సందంట్లో కొన్నిసార్లు వారు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలా జరగకుండా గుర్తు ఉండేందుకే ఇద్దరికీ బాసికాన్ని కడతారు. నుదిటిమీద బాసికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి కచ్చితంగా దానిమీదకి దృష్టి పోతుందన్నమాట.

సేకరణ : సాక్షి ఆదివారం పుస్తకం లోనిది
  

Monday 1 September 2014

బాపుగారి ఆత్మకు శాంతి చేకూరాలని...

తిరిగిరాని లోకాలకు చేరుకున్న 

బాపుగారి ఆత్మకు

శాంతి చేకూరాలని 

ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... 

సిగ్గుపడకు.....