Saturday 22 November 2014

ఉతుకుతుందిలే....

మా పిల్లలకు చదువుతోపాటు సంస్కారం నేర్పిస్తున్నాం
గొప్పగా చెప్పాడు సుబ్బారావు తన ఫ్రెండ్ తో...
ఇంతకీ సంస్కారమంటే ఏమి నేర్పిస్తున్నరేమిటి? అడిగాడు..అప్పారావు...
మరి ఎమి లేదు మా పిల్లల బట్టలని మా ఆవిడ సంస్కారవంతమైన సబ్బుతో ఉతుకుతుందిలే....
ఆ..ఆ....

Friday 14 November 2014

సమతా మమతా..

పండిత నెహ్రు పుట్టిన రోజు..
పాపాలందరికి పండగ రోజు...
సమతా మమతా.. పుట్టిన రోజు..
మంచికి కోవెల కట్టిన రోజు...

బాలలదినోత్సవ శుభాకాంక్షలు........

Tuesday 11 November 2014

విత్తును బట్టే ఫలం ......

విత్తును బట్టే ఫలం

నిజాయితీ అనే విత్తును నాటితే .... నమ్మకం అనే ఫలాన్ని కోసుకుంటాం.
మంచితనం అనే విత్తును నాటితే .... స్నేహితులు అనే ఫలాన్ని కోసుకుంటాం.
నిరాడంబరత అనే విత్తును నాటితే .... గొప్పతనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
కష్టపడి పనిచెయ్యడం అనే విత్తును నాటితే .... విజయం అనే ఫలాన్ని కోసుకుంటాం.
క్షమాపణ అనే విత్తును నాటితే .... శత్రునాశనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
ఓర్పు అనే విత్తును నాటితే .... అభివృద్ధి అనే ఫలాన్ని కోసుకుంటాం.
పుణ్యం అనే విత్తును నాటితే .... సుఖం అనే ఫలాన్ని కోసుకుంటాం.
శరణాగతి అనే విత్తును నాటితే .... మనశ్శాంతి అనే ఫలాన్ని కోసుకుంటాం.
భక్తి అనే విత్తును నాటితే .... జ్ఞానం అనే ఫలాన్ని కోసుకుంటాం.