Wednesday 29 January 2014

భగవద్గీత ఏం చెబుతుంది ?

భగవద్గీత ఏం చెబుతుంది ?
      ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవటం కాదు...అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. సుఖం..శాంతి..త్యాగం...యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.ఏది శాశ్వతమో...ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాల వివరణ ఇస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం...మోక్షం...బ్రహ్మం...ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.కర్మ, భక్తి, జ్ఞాన, మార్గాల ద్వారా వేలు పట్టుకొని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.





సేకరణ : సాక్షి ఆదివారం పుస్తకం

Tuesday 21 January 2014

ఆయన ఒకటి తలస్తే..

"నా గుండె గట్టిది మా అమ్మలా నేను కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటానని" మెన్ననే ఈ మధ్య అక్కినేని గారు ఎంతో నమ్మకంతో చెప్పారు. కానీ ఆయన ఒకటి తలస్తే.. భగవంతుడు మరొకటి తలచాడు. కానీ అక్కినేని గారు భౌతికంగా మననుంచి దూరమైనా ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరంజీవిగా, చిరస్థాయిగా కొలువై ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తూ......




అక్కినేని గారికి కన్నీటి నివాళి

Saturday 18 January 2014

వెండితెర దేవుడు

వెండితెర దేవుడు
"అందాల రాముడు"
"రాజుపేద"లందరికీ
"జయసింహు"డతడు
సినీ "మాయాబజార్"లో
"అగ్గిరాముడతడు"
"భూకైలాసం"లో
"కార్తికేయుని కథ"లు చెప్ఫే
"సారంగధరుడు"
"అప్పు చేసి పప్పు కూడు" వద్దంటాడు
"కలిసుంటే కలదు సుఖ"మంటాడు
"రక్తసంబంధం" లేకున్నా
అందరూ "ఆత్మ బంధువులే"నంటాడు
"మనుషుల్లో దేవుడు"
సినీ వినీలాకాశంలో "తార"క రాముడు

(18-1-14) నందమూరి తారక రామారావు వర్ధంతి.


Friday 17 January 2014

గుడిలో ఎలా ఉండాలి ?

గుడిలో ఎలా ఉండాలి ?

1.  గట్టిగా అరవటమూ, నవ్వటమూ, ఐహిక విషయాల గూర్చి మాట్లాడటమూ చేయరాదు.

2.  గుడి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి.
3.  కొబ్బరి పెంకలు, అరటి తొక్కలు ఆలయంలో చేసిన ఏర్పాట్ల ప్రకారం వాటిల్లోనే వేయాలి.
4.  తోసుకుంటూ లేదా ముందువారిని అధిగమిస్తూ దర్శనం చేసుకోరాదు.
5.  భగవంతుడ్ని కనులారా వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేసుకోవాలి.
6.  దేవాలయం లోని నిల్చుని, గృహంలో కూర్చొని తీర్ధం పుచ్చుకోవాలి.
7.  దీపారాధన శివునికి ఎడమ వైపూ, శ్రీమహావిష్ణువుకు కుడివైపూ చేయాలి. 
8.  అమ్మవారికి నూనె దీపమయితే కుడి పక్కగా, ఆవు నేతి దీపమయితే కుడివైపు వెలిగించాలి.



సేకరణ : శ్రీకనకదుర్గప్రభ మాస పత్రిక.

Tuesday 14 January 2014

మా వంట భోంచేస్తారా?

మిత్రులారా...ఏమిటి మీ ఇంట్లో ఇంకా వంటలు కాలేదా? మరేం పర్వాలేదు.మా నెట్టింట్లో వడ్డన కూడా పూర్తయింది. పంచభక్ష పరమాన్నాలతో విందు సిధ్ధంగా ఉంది. మరీ ఈ ఐటములన్నీ మీ అరిటాకులో వున్నాయో లేవో చూసుకొండి.. పండుగ పూట మీ ఇంట తింటారా?
మా వంట భోంచేస్తారా? చాయిస్ ఈజ్ యువర్స్.. తిన్నాక బ్రేవ్ మని త్రేనుపు రావాలి.

హరిదాసుగారు మరీ చిన్నగా ఉన్నారు కదూ....

హితులు, స్నేహితులు, మిత్రులు అందరికీ..
భోగి, సంక్రాంతి మరియు కను

మ పండుగ శుభాకాంక్షలు...

Sunday 12 January 2014

భోగీ

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా న
భోగీ మరియు సంక్రాంతి శుభా కాంక్షలండీ...

స్వామి వివేకానంద జయంతి

నేడు
స్వామి వివేకానంద జయంతి

Friday 10 January 2014

దేవ్యారాధన

దేవ్యారాధన

దేవ్యారాధన దక్షిణ భారతమునందే గాక ఉత్తర భారతమునందు విశేషముగా జరుగుట గమనార్హం. ఈజిప్టునందు ఐసిస్ గాను, బాబిలోనియాలో ఐప్తార్ గను, ఫ్రిజియాయందు సైబిలిగను, గ్రీసు నందు ఆఫ్రోడైటుగను, సైప్రెస్ నందు పాప్టారిసుగను, మెక్సికోయందు విష్ గాను, ఆఫికాయందు సలాంబో అనియు, రోము నందు జృనోగను, అస్సీరియాయందు మజర్ గను, చైనా యందు టైయనియు "శ్రీ పరాశక్తి" ని ధ్యానించి యావత్ర్పపంచము తరించుచున్నది.


సేకరణ: శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక

Wednesday 8 January 2014

గుడిలో దర్శనం అయ్యాక కూర్చునేదెందుకు... ?

గుడిలో దర్శనం అయ్యాక కూర్చునేదెందుకు... ?

        స్వామి దర్శనం, షడగోప్యము అయ్యాక ఒకింతసేపు కూర్చొని వెళ్ళాలి. అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము, పుణ్యం కోసము, కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదు. అలా కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుంటాము. ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాము. రోజువారి జీవన విధానాన్ని సరి చేసుకుని సరైన మార్గంలో నడుస్తాము. గుడిలో కూర్చోవడం ఒక రకమైన ధ్యాన పధ్ధతి కూడా.
       కేవలం కూర్చోవటమే కాకుండా ఓ రెండు నిమిషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది.

సేకరణ : శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక