Monday, 23 December 2013

తీర్ధం ఎందుకు ? ఎలా తీసుకోవాలి ?

తీర్ధం ఎందుకు  ? ఎలా తీసుకోవాలి ?


       తీర్ధం అంటే తరింపచేసేది అని అర్ధం.ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం, చేసుకున్నాక, పూజారులు "అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం... పాదోదకం పావనం శుభం" అంటూ తీర్ధం ఇస్తారు. భగవంతుని పవిత్రమైన పాదాలను తాకిన... ఈ తీర్ధం మిమ్మల్ని అకాల మరణం రాకుండా కాపాడుతుంది.... సర్వరోగాలను నివారిస్తుంది, సమస్త పాపాలనూ ప్రక్షాళన చేస్తుంది... అని భావం.  భగవంతుని దగ్గరకు వచ్చేవరకు అది ఉత్తి నీరే. కాని ఆయనను చేరాక అందులో తులసి, కర్పూరం... వంటివి చేరి తీర్ధంగా మారుతుంది. పవిత్రమైన ఈ ఉదకంలో కలిపే కర్పూరం, తులసి వంటివి ఆరోగ్యకారకాలు. గొంతులో ఏదైనా అడ్డుపడ్డట్టుగా ఉంటే తులసి ఆకు నమిలితే చాలు అడ్డు తొలగి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. అలాగే కర్పూరం కూడా ! పురుషులు ఉత్తరీయాన్ని, స్త్రీలు పైటచెంగును చేతికింద పెట్టుకుని భగవత్ప్రసాదంగా భావిస్తూ ఒక్క చుక్క కూడా కిందపడనివ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్ధం తీసుకోవాలి.

(ఇది 23-12-2013 సోమవారం సాక్షి  ఫ్యామిలీలో  ప్రచురితమైనది.)

No comments:

Post a Comment