Friday, 6 December 2013

దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంటెందుకు కొడతారు ?

దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంటెందుకు కొడతారు ?

          దేవాలయాల్లో గంటను అనేక
సార్లు అనగా నైవేద్యము పెట్టేటప్పుడూ, మేలుకొలుపు పాడేటప్పుడూ, ఆలయం మూసేటప్పుడు గంటకొడతారు.
          హారతినిచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్ధం, దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని, ఏ దేవునికి హారతినిస్తున్నామో, ఆ దేవుడు మహాదైవాంశతో విగ్రహంలో చేరాలని,ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు ఈ రూపాన్ని భక్తులు కనులారా వీక్షించేలా, హారతి వెలుగులో స్వామిని చూపడమే పరమార్ధం.  
          కావున హారతి వేళ దైవాన్ని ప్రత్యక్షంగా చూసినట్టే.

No comments:

Post a Comment