ఏ ఏ సమయాలలో ఏ దేవుడ్ని పూజించాలి... ?
సూర్యభగవానుని 4.30 నుంచి 6 లోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీరామునికీ, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతి.ఆరు నుంచి 7.30 వరకూ మహాశివుడ్నీ, దుర్గాదేవిని పూజించిన మంచిఫలము కలుగును.
మధ్యాహ్నము 12 గంటలప్పుడు శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు.
రాహువులకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రము ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయ సమయం శివపూజకు దివ్యమైనవేళ. రాత్రి ఆరునుంచి తొమ్మిది వరకూ లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.
తెల్లవారుఝామున మూడు గంటలకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ ఆపారంగా ప్రసరిస్తుంది.
No comments:
Post a Comment