Monday, 9 December 2013

గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు ?


గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు ?

     గృహములోవలే చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది.     భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు శెలవిస్తున్నాయి.     భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండలమీదే వెలిశాడు. కావున ఆ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు.     నిత్యం దేవుడ్ని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ, అలాగే అంతటి భక్తుడ్ని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము.      దేవాలయాల్లో గడపని తొక్కిదాటకండి, కేవలం దాటండి.


No comments:

Post a Comment