Tuesday, 31 December 2013

మితృలందరికీ...

Happy New Year 2014

మనస్పూర్తిగా...

మిత్రులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు....

ఈ సంవత్సరం మీ అందరికీ...
కోటికాంతుల చిరునవ్వులతో
భగవంతుడు మీకు నిండునూరేళ్ళు 
ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...


Sunday, 29 December 2013

భగవద్గీత శ్లోకాల పోటీలో ద్వితీయ బహుమతి

 భగవద్గీత  శ్లోకాల పోటీలో ద్వితీయ బహుమతి

చిన్మయ మిషన్ ఇటీవల నిర్వహించిన భగవద్గీత 13వ అధ్యాయం శ్లోకాల పోటీలో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ (2వ తరగతి) మండల స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. 29-12-13 విజయవాడ కేబీఎన్ కళాశాలలో జరిగిన సభలో బహుమతితోపాటు సర్టిఫికెట్ అందుకుంటున్నప్పటి దృశ్యం. 


Thursday, 26 December 2013

నీ రూపమే..

హృదయంలోనే కాదు.. నా కనులలోనూ నీ రూపమే..

Wednesday, 25 December 2013

వచ్చేవి పోయేవి మూడు.



ఈ మూడింటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

Monday, 23 December 2013

Interesting Facts

Interesting Facts


తీర్ధం ఎందుకు ? ఎలా తీసుకోవాలి ?

తీర్ధం ఎందుకు  ? ఎలా తీసుకోవాలి ?


       తీర్ధం అంటే తరింపచేసేది అని అర్ధం.ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం, చేసుకున్నాక, పూజారులు "అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం... పాదోదకం పావనం శుభం" అంటూ తీర్ధం ఇస్తారు. భగవంతుని పవిత్రమైన పాదాలను తాకిన... ఈ తీర్ధం మిమ్మల్ని అకాల మరణం రాకుండా కాపాడుతుంది.... సర్వరోగాలను నివారిస్తుంది, సమస్త పాపాలనూ ప్రక్షాళన చేస్తుంది... అని భావం.  భగవంతుని దగ్గరకు వచ్చేవరకు అది ఉత్తి నీరే. కాని ఆయనను చేరాక అందులో తులసి, కర్పూరం... వంటివి చేరి తీర్ధంగా మారుతుంది. పవిత్రమైన ఈ ఉదకంలో కలిపే కర్పూరం, తులసి వంటివి ఆరోగ్యకారకాలు. గొంతులో ఏదైనా అడ్డుపడ్డట్టుగా ఉంటే తులసి ఆకు నమిలితే చాలు అడ్డు తొలగి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. అలాగే కర్పూరం కూడా ! పురుషులు ఉత్తరీయాన్ని, స్త్రీలు పైటచెంగును చేతికింద పెట్టుకుని భగవత్ప్రసాదంగా భావిస్తూ ఒక్క చుక్క కూడా కిందపడనివ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్ధం తీసుకోవాలి.

(ఇది 23-12-2013 సోమవారం సాక్షి  ఫ్యామిలీలో  ప్రచురితమైనది.)

Sunday, 15 December 2013

రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిధులు చూసుకోవాలా ?

రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిధులు చూసుకోవాలా ?


        దీర్ఘవ్యాధులవారు తమ వ్యాధులు పోవాలనీ, మిగతావారు కోరికలతోనూ, భక్తితోనూ, శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఇలా చెయ్యటం వల్ల మరణ భయం పోతుందని పురాణ ఆధారము. రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమును శివసంచారము తెలుసుకొని చేయించుకోవాలి. మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని రుద్రాభిషేకం చేయించుకోవాలి. శివపూజ చేసే తిథిని 10తో హెచ్చవేస్తే అనగా "0" చేర్చి 7తో భాగిస్తే "1" వస్తే కైలాసమున, "2" వస్తే పార్వతీదేవి వద్ద, "3" వస్తే వాహనుడై  ఉన్నట్టు, "4" వస్తే కొలువు తీరినట్లు, "5" వస్తే నైవేద్యము స్వీకరిస్తున్నట్లు, "6" వస్తే ఆనంద నాట్యము చేస్తున్న సమయముగా, "7" వస్తే స్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి. 7-14 తిథులలో పూజ తగదు. వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి.


శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ప్రచురిస్తున్న శ్రీ కనకదుర్గ ప్రభ ఆధ్యాత్మిక సంచిక నుంచి సేకరించిన సమాచారం.

For more details visit www.durgamma.com

Saturday, 14 December 2013

బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు




బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు



బ్రహ్మ ప్రాణం పోసి మనల్ని సృష్తిస్తే..బాపు గారు బొమ్మలతో ప్రతిసృష్టి చేస్తారు. బొమ్మలైనా, గీతలైనా మన మనోఫలకాలపై చెరగని గుర్తులుగా మిగిలిపోతాయి. 80వ వసంతంలోకి అడుగిడుతున్న బాపు గారు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ...

Thursday, 12 December 2013

బ్లాగ్ పాఠకులకు మనవి

బ్లాగ్ పాఠకులకు మనవి


నాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక, భక్తి సంభందిత విషయాలను పలు పత్రికల్లో చదివి తెలుసుకున్నాను. ఎంతో విలువైన సమాచారం  నలుగురికీ తెలియజేయాలనే సదుద్దేశంతోనే వీటిని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. అంతేగాని వేరే వాళ్ళవి కాపీ కొట్టడం లేదు. ఏదైనా పొరపాటు జరిగితే నాకు మెయిల్ చేయండి. ఆ పోస్ట్ తొలగిస్తాను. నేను పెట్టే ఈ సమాచారం అంతా ఫేస్ బుక్, ఆధ్యాత్మిక పత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.. ఇకపై ఎక్కడ నుంచి సేకరించానో కూడా కింద ఉదహరిస్తాను. నా బ్లాగ్ రచనలను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి.


మీ స్పందనను తప్పక తెలియజేస్తారు కదూ..

ధన్యవాదములతో...
మీ సుజి 

విక్టరీ వెంకటేష్ కి జన్మదిన శుభాకాంక్షలు

అభిమాలకు 'చంటి '
అమ్మాయిలకు 'పోకిరి రాజా'
యువతకు 'సూపర్ ' స్టార్

విక్టరీ వెంకటేష్ కి 

జన్మదిన శుభాకాంక్షలు

Wednesday, 11 December 2013

తలమీద షడగోప్యం పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది ?

తలమీద  షడగోప్యం పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది ?

       దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్ధం,  షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.
       కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. షడగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరిక షడగోప్యం. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్ధం.

స్నేహితుని విలువ


దీపారాధనలో ఆంతర్యం ఏమిటి ?


Tuesday, 10 December 2013

శ్రీ మహాలక్ష్మీదేవి స్థానాలు ఏమిటి ?

శ్రీ మహాలక్ష్మీదేవి స్థానాలు ఏమిటి ?

     గురుభక్తి, దైవభక్తి మాతా పితృభక్తి గల వారికి లక్ష్మీ తన కటాక్షాన్ని ఇస్తుంది. అతిగా నిద్రపోయే వారి గృహంలోనూ, ఉదయాన్నే పూజ చేయనివారి గృహం లోనూ లక్ష్మి నిలవదు.
      గృహం పరిశుభ్రంగా లేకపోయినా, గడపకు పసుపు రాయకపోయినా, స్త్రీకి నిషిద్ధమైన నాలుగు రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా లక్ష్మీ ఆగృహం నుంచి వెళ్ళిపోతుంది.
      ముగ్గు, పసుపు, పూలు, పళ్ళు, పాలు, దీప, ధూప, మంగళద్రవ్యాలు లక్ష్మీ స్థానాలు.

Monday, 9 December 2013

గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు ?


గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు ?

     గృహములోవలే చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది.     భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు శెలవిస్తున్నాయి.     భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండలమీదే వెలిశాడు. కావున ఆ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు.     నిత్యం దేవుడ్ని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ, అలాగే అంతటి భక్తుడ్ని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము.      దేవాలయాల్లో గడపని తొక్కిదాటకండి, కేవలం దాటండి.


Touch your Heart

Have A Nice Day

second chance

Good Night for all Friends

గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు ?


గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు ?

     గృహములోవలే చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది.
     భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు శెలవిస్తున్నాయి.
     భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండలమీదే వెలిశాడు. కావున ఆ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు.
     నిత్యం దేవుడ్ని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ, అలాగే అంతటి భక్తుడ్ని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము.
      దేవాలయాల్లో గడపని తొక్కిదాటకండి, కేవలం దాటండి.

Sunday, 8 December 2013

kanaka durga temple .vijayawada in the year 1900

Hai friends 

Kanaka Durga Temple .vijayawada in the year 1900


గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేయాలా?

గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేయాలా?


తలస్నానం చేసి గుడికి వెళితే శరీరము మొత్తము శుచిగా ఉంచుకొని దర్శనము చేసుకున్నట్టు. మన నిత్యకృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ, మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా, పరిశుధ్ధంగా చేసుకుని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక, కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకొని దర్శించుకుంటున్నాము. ఈ శరీరంలా మనసును శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమని అర్థమే పూర్తి స్నానం యొక్క భావము.


Saturday, 7 December 2013

బహుదూరపు బాటసారి.

బహుదూరపు బాటసారి..
మళ్ళీరావయ్య ఒకసారి..

భగవంతునికి దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి ?

భగవంతునికి దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి ?

        ఆవు నెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము.
        ఆవునెయ్యితో వెలిగించిన దీపఫలం అనంతము. అష్టైశ్వర్యాలూ, అష్ట భోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టము.  
        ఆముదముతో వెలిగించిన దాంపత్య సుఖము, జీవిత సౌఖ్యం లభిస్తాయి.
        వేరుశనగ నూనెతో దీపాన్ని దేముని ముందు పెట్టరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గనపతికి నువ్వులనూనెతో వెలిగించిన దీపము అన్న ప్రీతి.

Friday, 6 December 2013

దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంటెందుకు కొడతారు ?

దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంటెందుకు కొడతారు ?

          దేవాలయాల్లో గంటను అనేక
సార్లు అనగా నైవేద్యము పెట్టేటప్పుడూ, మేలుకొలుపు పాడేటప్పుడూ, ఆలయం మూసేటప్పుడు గంటకొడతారు.
          హారతినిచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్ధం, దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని, ఏ దేవునికి హారతినిస్తున్నామో, ఆ దేవుడు మహాదైవాంశతో విగ్రహంలో చేరాలని,ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు ఈ రూపాన్ని భక్తులు కనులారా వీక్షించేలా, హారతి వెలుగులో స్వామిని చూపడమే పరమార్ధం.  
          కావున హారతి వేళ దైవాన్ని ప్రత్యక్షంగా చూసినట్టే.

Thursday, 5 December 2013

శివాలయాల్లో ఎందుకు ప్రదక్షిణం చేయరాదు?

శివాలయాల్లో ఎందుకు ప్రదక్షిణం చేయరాదు?

     మహేశ్వరుడు దేవాధిదేవుడు. అట్టి పరమేశ్వరునికి తలపై నుంచి గంగ జాలువారుతుంది. మహాశివుడ్ని అభిషేకించిన జలం ఆయన పీఠంపై జారి, ఏర్పరచిన దారి నుంచి బయటికి ప్రవహిస్తుంది. ప్రదక్షిణం చేస్తే గంగను దాటినట్టే అవుతుంది. కావున  శివాలయంలో ప్రదక్షిణ సరికాదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.

Wednesday, 4 December 2013

చిచ్చరపిడుగు...


చిన్మయమిషన్ నిర్వహించిన భగవద్గీత శ్లోక కంఠస్త పోటీల్లో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ(2వ తరగతి) ద్వితీయస్థానం సాధించింది. గురువారం (5-12-13) ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర భూమి, ప్రజాశక్తి దినపత్రికల్లో ప్రచురితమైన కథనాల క్లిప్పింగ్స్.




మన స్నేహ కుసుమాలు కూడా పరిమళాలు వెదజల్లాలి..

Good Evening  Friends..


మన స్నేహ కుసుమాలు కూడా పరిమళాలు వెదజల్లాలి..

Tuesday, 3 December 2013

నేడు ఘంటసాల జయంతి..

నేడు ఘంటసా
ల జయంతి..
సందర్భంగా 

ఆయనకి నా శతకోటి వందనాలు...
మనందరి తరుపున నీరాజనాలు...

ఏ ఏ సమయాలలో ఏ దేవుడ్ని పూజించాలి... ?

ఏ ఏ సమయాలలో ఏ దేవుడ్ని పూజించాలి... ?

     సూర్యభగవానుని 4.30 నుంచి 6 లోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీరామునికీ, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతి.
     ఆరు నుంచి 7.30 వరకూ మహాశివుడ్నీ, దుర్గాదేవిని పూజించిన మంచిఫలము కలుగును.
     మధ్యాహ్నము 12 గంటలప్పుడు శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన హనుమ కృపకు మరింత  పాత్రులగుదురు.
     రాహువులకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రము ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయ సమయం శివపూజకు దివ్యమైనవేళ. రాత్రి ఆరునుంచి తొమ్మిది వరకూ లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.
      తెల్లవారుఝామున మూడు గంటలకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ ఆపారంగా ప్రసరిస్తుంది.

చిన్నారి నవ్యశ్రీ ప్రతిభ

చిన్నారి నవ్యశ్రీ ప్రతిభ

చిన్నారి నవ్యశ్రీ  ప్రతిభ


చిన్మయ మిషన్ ఇటీవల నిర్వహించిన భగవద్గీత 13వ అధ్యాయం శ్లోకాల పోటీలో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ (2వ తరగతి) మండల స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. త్వరలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. చిన్నప్పటి నుంచే వివిధ శతకాలు, శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా ఆలపిస్తుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు అలవడాలనే ఉద్దేశ్యంతో మా అమ్మాయి నవ్యశ్రీతో పాటు బాబు బాలశ్రీవత్సకు భగవద్గీత, శతకాలు నేర్పుతున్నాం. మీ పిల్లలకూ ఆధ్యాత్మిక సువాసనలు రుచి చూపిస్తారు కదూ.. మా పిల్లలకు మీ ఆశ్శీసులు అందించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ....

లేటెస్ట్ వెర్షన్ లవ్.కామ్.

లేటెస్ట్ వెర్షన్ లవ్.కామ్.


నా ప్రేమ వెబ్ సైట్ లో
ప్రింట్ వాట్ ఐ లైక్ పై
ఒక్క క్లిక్
ప్రివ్వూలో నీ ఇమేజ్
అరే..యార్..
నా హార్ట్ డ్యామేజ్
ఫైల్ మోడ్స్ లో
నీ ఫేస్ కలర్ ఛేంజ్
ఐ ట్యూన్ మిక్శ్ చేశా
ఎక్శ్ టెన్సన్ యాడ్ చేశా
నీ ఐడెంటిటీ
యాక్సెస్ అయ్యింది.
ప్రేమ టిప్స్
టెక్నిక్స్ షేర్ చేశా
నా భావాల అప్ డేట్ షేడ్స్
నీ అకౌంట్ కి లింక్ చేశా
నీ చిత్రాల స్క్రీన్ సేవర్లే...
లేటెస్ట్ వెర్షన్
యాంటీ వైరస్
ఇన్ స్టాల్ చేశా
నా ఈ ప్రేమను
బ్లాక్ చేయకు
నా నేమ్ ఫోల్డ్ ర్ ను
డిలీట్ చేయకు..
టెక్నాలజీ రేసులో పడి
మిస్ యూజ్ చేయకు..
వేస్ట్ ఫైల్ అని
రీ సైకిల్ బిన్ లోనికి తోయకు
ఈ ప్రేమ ఐకాన్ ని
నెగ్ల్ క్ట్ చేయకు..
ఐ యామ్ యువర్ పీసీ
యూ ఆర్ మై మౌసీ

- తెర్లి అమూల్య  1-12-13

Monday, 2 December 2013

జయహో..

కృషితో నాస్తి దుర్భిక్షం


సర్వ అవయువాలున్నా..బుద్ధి వికాసం లేనప్పుడు..వికలాంగత్వం ఉన్నా..

తమ ప్రత్యేకత చాటుతున్న వారందరికీ
జయహో..


గుడిలో ప్రదక్షిణల పద్ధతి ?

గుడిలో ప్రదక్షిణల పద్ధతి ?

     ధ్వజస్థంభం నుంచి మళ్ళీ ధ్వజస్థంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరమయితే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభిం
చి మళ్ళీ ముఖద్వారం వద్దకు వస్తే ఓ ప్రదక్షిణ పూర్తయినట్టు, హనుమంతునకు అయిదు ప్రదక్షిణలు ప్రీతి. ఏదైనా కోర్కె ఉంటే 11, 27, 54, 108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితముంటుది. నవగ్రహాలకు మూడిసార్లూ, లేదా తొమ్మిదిసార్లూ చేయచ్చు. అలాగే పదకొండూ, ఇరవై ఒకటీ, ఇరవై ఏడూ ఇలా బేసి సంఖ్యలో చేయవచ్చు.