Tuesday, 2 December 2014

నారీలతా పూలు...

నారీలతా పూలు...
హిమాలయాలలో  ఈ చెట్టుకు నారీలతా పూలు అచ్చం స్త్రీమూర్తి ఆకారంలో వికసిస్తుందంట. చాలా వింతగా వుంది కదా

Saturday, 22 November 2014

ఉతుకుతుందిలే....

మా పిల్లలకు చదువుతోపాటు సంస్కారం నేర్పిస్తున్నాం
గొప్పగా చెప్పాడు సుబ్బారావు తన ఫ్రెండ్ తో...
ఇంతకీ సంస్కారమంటే ఏమి నేర్పిస్తున్నరేమిటి? అడిగాడు..అప్పారావు...
మరి ఎమి లేదు మా పిల్లల బట్టలని మా ఆవిడ సంస్కారవంతమైన సబ్బుతో ఉతుకుతుందిలే....
ఆ..ఆ....

Friday, 14 November 2014

సమతా మమతా..

పండిత నెహ్రు పుట్టిన రోజు..
పాపాలందరికి పండగ రోజు...
సమతా మమతా.. పుట్టిన రోజు..
మంచికి కోవెల కట్టిన రోజు...

బాలలదినోత్సవ శుభాకాంక్షలు........

Tuesday, 11 November 2014

విత్తును బట్టే ఫలం ......

విత్తును బట్టే ఫలం

నిజాయితీ అనే విత్తును నాటితే .... నమ్మకం అనే ఫలాన్ని కోసుకుంటాం.
మంచితనం అనే విత్తును నాటితే .... స్నేహితులు అనే ఫలాన్ని కోసుకుంటాం.
నిరాడంబరత అనే విత్తును నాటితే .... గొప్పతనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
కష్టపడి పనిచెయ్యడం అనే విత్తును నాటితే .... విజయం అనే ఫలాన్ని కోసుకుంటాం.
క్షమాపణ అనే విత్తును నాటితే .... శత్రునాశనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
ఓర్పు అనే విత్తును నాటితే .... అభివృద్ధి అనే ఫలాన్ని కోసుకుంటాం.
పుణ్యం అనే విత్తును నాటితే .... సుఖం అనే ఫలాన్ని కోసుకుంటాం.
శరణాగతి అనే విత్తును నాటితే .... మనశ్శాంతి అనే ఫలాన్ని కోసుకుంటాం.
భక్తి అనే విత్తును నాటితే .... జ్ఞానం అనే ఫలాన్ని కోసుకుంటాం.


Sunday, 19 October 2014

అందరికీ ధన్యవాదములు

నేటితో నా బ్లాగర్ వీక్షకుల సంఖ్య 10025 కి చేరిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. సాధారణ గృహిణి ఐన నాకు ఇంటర్నెట్ గురించి అసలు తెలియని దశలో మావారి ప్రోత్సాహంతో ఫేస్ బుక్, బ్లాగర్ ల్లొ ఖాతాలు ఓపెన్ చేయించి వాటి గురించి వివరించారు. దీంతొ నా బ్లాగర్ ప్రపంచంలో నా మదిలో భావాలు, నాకు తెలిసిన మంచి విషయాలు, నేను చదివిన సంప్రదాయాలపై మిత్రులందరితో పంచుకుంటున్నాను. తక్కువ వ్యవధిలోనే పదివేల మంది నా బ్లాగర్ వీక్షించి నన్ను ఎంతగానో ప్రోత్సహించినందుకు

అందరికీ ధన్యవాదములు. 

మీ అభిప్రాయం తప్పక తెలియజేస్తారు కదూ...మీ సుజి...



Thursday, 11 September 2014

చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు ?


     ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గంలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు.

సేకరణ: ఆదివారం సాక్షి పుస్తకం

Sunday, 7 September 2014

దిష్టి ఎందుకు తీస్తారు ?

దిష్టి ఎందుకు తీస్తారు ?

      చిన్నపిల్లలకి ఏదైనా అనారోగ్యం కల్గినప్పుడు 'ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో' అంటూ గబ గబా దిష్టి తీసేస్తుంటారు. కొన్ని సందర్భాలలో పెద్దలకు కూడా తీస్తుంటారు. నిజానికి అలాంటిదేమీ ఉండదు. దిష్టి అనేది దృష్టికి వికృతి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని సూటిగా చూసినప్పుడు వారి నుంచి విద్యుత్ తరంగాలు వచ్చి శరీరాన్ని తాకుతాయనీ, ఒక వేళ  ఆ తరంగాలు వారి శరీరానికి హాని కలిగించేవి కనుక అయితే తల తిరగడం, కడుపులో తిప్పి వాంతులవడం లాంటివి జరుగుతాయని ఓ నమ్మకం. దాంతో దిష్టి తగిలిందని  అంటారు. అందుకే దిష్టి తీసిన నీళ్ళను అందరూ తిరిగే చోట వేయరు. ఎవరైనా తొక్కితే మళ్ళీ వారికి అనారోగ్యం కలుగుతుందని భయం.



సేకరణ : సాక్షి పుస్తకం నుంచి

Friday, 5 September 2014

బాసికం ఎందుకు కడతారు ?

బాసికం ఎందుకు కడతారు ?

వివాహ ఘట్టంలో వధూవరుల అలంకరణలో బాసికం ఒక ప్రధానభాగం. అయితే దీన్ని ఎదుకు కడతారు అన్నది చాలా మందికి తెలియదు. ఈ ఆచారం వెనుక ముఖ్యమైన కారణం ఉంది.
    వివాహానికి అత్యంత అవసరమైనది సుముహూర్తం. సరిగ్గా ఈ ముహూర్తంలో వధువు కనుబొమలమధ్య స్థానాన్ని, అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అయితే పెళ్ళి సందంట్లో కొన్నిసార్లు వారు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలా జరగకుండా గుర్తు ఉండేందుకే ఇద్దరికీ బాసికాన్ని కడతారు. నుదిటిమీద బాసికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి కచ్చితంగా దానిమీదకి దృష్టి పోతుందన్నమాట.

సేకరణ : సాక్షి ఆదివారం పుస్తకం లోనిది
  

Monday, 1 September 2014

బాపుగారి ఆత్మకు శాంతి చేకూరాలని...

తిరిగిరాని లోకాలకు చేరుకున్న 

బాపుగారి ఆత్మకు

శాంతి చేకూరాలని 

ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... 

సిగ్గుపడకు.....


Friday, 8 August 2014

అతి మంచిది కాదు ....

అతి ఎక్కువైనా , తక్కువైనా నష్టం మాత్రం మనకే సుమా. జాగ్రత్త వహించి నడుచుకుందాం ఏమంటారు....
 శుభరాత్రి......

Thursday, 7 August 2014

కృపాకటాక్షములు

స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులందరిపైనా శ్రీ వరలక్ష్మీదేవి కృపాకటాక్షములు కలగాలని కోరుకుంటున్నాను.

Sunday, 3 August 2014

Thursday, 31 July 2014

దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు ?

దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు ?

దీపం పరబ్రహ్మ అన్నారు. దీపం జ్ఞానానికి, వెలుగుకి ప్రతీక. వెలిగే ప్రతిచోటా కాంతిని పంచే దీపం, హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి అక్కడ వెలుగుని నింపేలా చూడమని వేడుకుంటూ దేవుడికి దీపారాధన చేస్తారు. శాస్త్రాలు దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా కూడా పేర్కొంటున్నాయి. అందుకే "దీపము వెలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మీదేవి ధనములనిచ్చును. కాబట్టి ఎన్ని రకాల ఉపాచారాలు చేసినా, దీపారాధన చేయకుండా ఉండిపోకూడదు. అది చేయకపోతే పూజ సంపూర్ణం కానట్టే.



సేకరణ : సాక్షి ఆదివారం పుస్తకం.

Thursday, 24 July 2014

నమస్కారం ఎలా ?

నమస్కారం....

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి.
1.  రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2.  మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3.  గురుదేవులకు నుదుటి దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4.  దేవతలకు తలపై (నుదిటి పైన మణికట్టు అంటేలా ) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.

ఇది భారతీయ ఆచార విధి.



సేకరణ : శ్రీ కనకదుర్గ ప్రభ


Tuesday, 22 July 2014

Thursday, 10 July 2014

కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలెందుకు పొంగిస్తారు ?


కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలెందుకు పొంగిస్తారు ?

ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ఆదిపరాశక్తి నిర్ణయించుకుంది. తర్వాత త్రిమూర్తులను పిలిచి... బ్రహ్మకు సృష్టికార్యాన్ని, విష్ణువుకు స్థితి కార్యాన్ని, శివుడికి లయ కార్యాన్నీ అప్పగించింది. తను మాత్రం సృష్టిలోనే ఉత్తమ సృష్టి అయిన మానవులకు పరిపుష్టిని కలిగించేందుకుగాను గోమాత రూపంలో భూమికి దిగి వచ్చింది.అందువల్ల గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమత నుండి వచ్చే పాలు, మూత్రం, పేడ అన్నీ పవిత్రమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాలు స్వచ్ఛతకు, అభివృద్ధికి చిహ్నం. అందుకే అవి పొంగిన ఇంట్లో అష్టయిశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ పొంగి పొర్లుతాయని అంటారు. కాబట్టే కొత్త ఇంట్లోపాలుతప్పక పొంగిస్తారు.....




సాక్షి ఆదివారం పుస్తకం నుండి సేకరించడమైనది.....




Wednesday, 9 July 2014

విభూతి ఎందుకు రాసుకుంటారు ?

విభూతి ఎందుకు రాసు
కుంటారు ?

నెయ్యి, పలురకాల వనమూలికలను కలిపి, ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి ఆహుతిగా సమర్పించినప్పుడు.... అందులో నుంచి వచ్చే భస్మమే విభూతి. విభూతిని సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. కొందరు భుజాలూ, ఛాతి, ఇతరత్రా శరీర భాగాలకు కూడా రాసుకుంటారు. దానికి కారణం... ఏదైనా వస్తువును కాల్చినప్పుడు బూడిదగా మారుతుంది. అయితే బూడిదను కాల్చితే మళ్లీ బూడిదే మిగులుతుంది తప్ప అది రూపాంతరం చెందదు.అందుకే అది అతి పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మత్రమే కాక... విభూతిని ఒంటికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.....

సాక్షి ఆదివారం పుస్తకం నుంచి సేకరించడమైనది.....

Tuesday, 8 July 2014

కుడివైపునకు తిరిగి మనం

Tuesday, 8 July 2014

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్
రలేవాలి ?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాలను గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధించినది.
         మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తల వరకు, తలనుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమవైపు నుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూలదిశగా మన శరీర కదలిక వల్ల  రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
         ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివైపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలపడం జరుగుతోంది.
         పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమ వైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు. కాబట్టి పెద్దల మాట పాటించడం ఉత్తమం.

శ్రీ కనకదుర్గ ప్రభ మాసపత్రిక నుండి సేకరించడమైనది.

kalala prayanam


Friday, 30 May 2014

దర్భలకి అంతటి పవిత్రత ఏలా వచ్చింది ?

శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు దానిపైన మందర పర్వతంతో దేవదానవులు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేలమీద పడగా అవి దర్భలుగా భూమినుండి మొలకెత్తాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని ఉంచింది ఈ దర్భలమీదే! అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడ కాబట్టి వీటికింతటి పవిత్రత.


సేకరణ : సాక్షి ఫ్యామిలీ

Bangaram



Wednesday, 28 May 2014

మా బావ పెళ్ళికి...

హలో... బాగున్నారా... మేము ఏమి చేస్తున్నామని చూస్తున్నారా?..మరేమో మా బావ పెళ్ళికి మేమే పెద్దలం. అందుకే ఇలా పసుపు దంచుతున్నాం. ఇంతకీ మీకు రోకలి అంటే తెలుసా.. మా నాన్నమ్మ దాని గురించి చెప్పడమే కాక..ఇలా మాతోనే పెళ్లి పనులు చేయిస్తున్నారు..చాలా అలసిపోయాం..నాకూ(నవ్య)..చిన్నగా ఉంది చూడండీ లక్కీకి తలో ఐస్ క్రీం ఇస్తారు కదూ...

Tuesday, 27 May 2014

భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలి ?

భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలి ?

భార్యాభర్తలు కలసి చేసే ప్రతి కార్యక్రమమాలలో భార్య భర్తకి ఎడమ వైపునే ఉండాలనేది ఎప్పటినుంచే వస్తున్న సాంప్రదాయం. భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలనేది ఎవరికీ తెలియని విషయం కాదు. శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీలక్ష్మీదేవికి తన హృదయంలో  స్థానం కల్పించాడు అందువలన అని కొందరనుకుంటే, మరికొందరు ఇలా అనుకుంటున్నారు. పూర్వకాలంలో కుడివైపు ఆయుధాలు ధరించేవారు. అవి ఆడవారికి తగులుతాయనే ఉద్దేశ్యంతో ఎడమవైపున  వుండేవారు. అదే అచారంగా ఇప్పటికీ అందరూ ఆచరిస్తున్నారు.



సేకరణ : ఆరాధన మాసపత్రిక

Sunday, 25 May 2014

చాలా ఆనందంగా ఉంది

జీవితంలో ప్రతిఒక్కరికి పండుగ రోజు వారి పుట్టినరోజే.. ఈ రోజు నా జన్మదిన వేడుకలను అంతర్జాల స్నేహితుల శుభసందేశాల మధ్య జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు విషెష్ చెప్పిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞాతాభివందనములు. 


Wednesday, 7 May 2014

లక్ష్మీ

ఏది
లక్ష్మీ ప్రదమైనది ?

 దిక్కులలో తూర్పు దిక్కు శుభప్రదమైనది. పురాణాలలో శ్రీభాగవతం గొప్పది. సముద్రాలలో పాలసముద్రం,నదులలో గంగానది, ఆశ్రమాలలో గృహస్తాశ్రమం గొప్పవి. కటాక్షాలలో కమలనివాసి అయిన శ్రీ లక్ష్మీ కటాక్షం గొప్పది.


సేకరణ ఆరాధనా ధార్మిక మాసపత్రిక నుంచి...

Sunday, 4 May 2014

మరిమీరో....

మిత్రమా....ఓటు మన హక్కు..

అందరం ఓటు వేద్దాం

నిజాయితీ పరుడిని,నిస్వార్థపరుడైన నేతలను ఎన్నుకుందాం. మన భవిష్యత్ ను మార్చుకుందాం.


నేను ఓటు వేస్తా..మరిమీరో....


Saturday, 12 April 2014

మావారితో ఇలా..

మావారితో ఇలా..హార్స్ రైడింగ్...ఎలా వుంది ఫ్రెండ్స్..

Monday, 7 April 2014

.శ్రీరామనవమి శుభాకాంక్షలు...

మిత్రులకు, శ్రేయోభిలాషులకు...శ్రీరామనవమి శుభాకాంక్షలు...

Friday, 4 April 2014

వారణాసి

హాయ్ ఫ్రెండ్స్..ఎలా ఉన్నారు..
మీతో మాట్లాడి చాలా రోజులయ్యింది కదూ.. ఎందుకంటే మా కుటుంబసభ్యులందరం వారణాసికి వెళ్లాము. ఆ విషయాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను. జన్మలో ఒక్కసారి కాశీపట్టణం వెళ్లాలంటారు మన పెద్దలు. కాశీ విశ్వేశ్వరుడి దయవల్ల ఈ జన్మలో నేను వెళ్లివచ్చాను. అబ్బో చాలా పెద్ద నగరం. అంతా చూడాలంటే ఈ జన్మ సరిపోదు. కానీ మేము ఉన్న ఐదు రోజుల్లో కొన్ని మాత్రమే చూడగలిగాము. మెదటి మూడు రోజులూ మామయ్యగారి కర్యక్రమముతో గడిపాము. నాల్గవ రోజు పొద్దున్నే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం దివ్యంగా జరిగింది. ప్రయాగకు వెళ్లి వచ్చే సరికి రాత్రి ఎనిమిది అయ్యింది. ఇక చివరి రోజు మా ప్రయాణం రాత్రి 11గంటలకు. పొద్దున్న 8గంటలకు దర్శనంకి బయలుదేరాము. 3కిలోమీటర్ల దూరంలో లైను ఉంది. పిల్లలకు ఫలహారం పెట్టి లైనులో నిల్చున్నాము. దర్శనం అయ్యేసరికి 11గంటలు అయ్యింది. కాశీ విశాలాక్షి, కాశీ అన్నపూర్ణమ్మను దర్శించుకిని బయటకు వచ్చేసరికి సరిగ్గా 11-30గంటలు. ఇక ఈరోజు కూడా మణికర్ణికా ఘాట్ లో స్నానం చేయలేం అనుకున్నాం. అన్ని సందులు  తిరుగుతూ ఉన్నమాకు శివుని దయ వల్ల ఘాట్ కు దారి కనిపించింది. 12గంటలకు మణికర్ణికా ఘాట్ లో ముక్కోటి దేవతలు ఉంటారంట. ఆ సమయంలో స్నానం చేస్తే ఎంతో మంచిదని , స్నానం చేసి రూంకి వెళ్లేసరికి 1గంట అయ్యింది. భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయ్యి షాపింగ్ చేసాం. ఆ రోజు ఆదివారం కావటంతో  షాపులు తక్కువగా ఉన్నాయి . బనారస్ చీరలకు ఫేమస్ కదా అందికని కొన్ని చీరలను కొనుక్కొని , పిల్లలకు బొమ్మలు, గాజులు తీసుకుని బయట పడేసరికి రాత్రి 9గంటలు అయ్యింది. అక్కడితో కాశీ పట్టణానికి వీడ్కోలు పలికి విజయవాడకు ప్రయాణం అయ్యాము. చాలా ప్రదేశాలు చూశాము. వాటి గురించి మళ్లీకలిసినప్పుడు చెబుతానేం...