Tuesday, 8 July 2014
కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్ రలేవాలి ?
నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాలను గూర్చి మన
సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం
రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన
పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి
లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధించినది.
మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తల వరకు, తలనుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమవైపు నుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూలదిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివైపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలపడం జరుగుతోంది.
పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమ వైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు. కాబట్టి పెద్దల మాట పాటించడం ఉత్తమం.
శ్రీ కనకదుర్గ ప్రభ మాసపత్రిక నుండి సేకరించడమైనది.

No comments:
Post a Comment