Saturday, 30 November 2013

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు.... ?

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు.... ?

సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ, కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయపైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడయితే కొబ్బరికాయను స్వామిముందు కొడతామో మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ, లోపలున్నతెల్లని కొబ్బిరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే.  కొబ్బరికాయ అంటే మానవశరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం, పీచు మనలోని మాసం, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణధారం..... కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.... 

No comments:

Post a Comment