Thursday, 31 July 2014

దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు ?

దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు ?

దీపం పరబ్రహ్మ అన్నారు. దీపం జ్ఞానానికి, వెలుగుకి ప్రతీక. వెలిగే ప్రతిచోటా కాంతిని పంచే దీపం, హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి అక్కడ వెలుగుని నింపేలా చూడమని వేడుకుంటూ దేవుడికి దీపారాధన చేస్తారు. శాస్త్రాలు దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా కూడా పేర్కొంటున్నాయి. అందుకే "దీపము వెలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మీదేవి ధనములనిచ్చును. కాబట్టి ఎన్ని రకాల ఉపాచారాలు చేసినా, దీపారాధన చేయకుండా ఉండిపోకూడదు. అది చేయకపోతే పూజ సంపూర్ణం కానట్టే.



సేకరణ : సాక్షి ఆదివారం పుస్తకం.

Thursday, 24 July 2014

నమస్కారం ఎలా ?

నమస్కారం....

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి.
1.  రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2.  మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3.  గురుదేవులకు నుదుటి దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4.  దేవతలకు తలపై (నుదిటి పైన మణికట్టు అంటేలా ) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.

ఇది భారతీయ ఆచార విధి.



సేకరణ : శ్రీ కనకదుర్గ ప్రభ


Tuesday, 22 July 2014

Thursday, 10 July 2014

కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలెందుకు పొంగిస్తారు ?


కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలెందుకు పొంగిస్తారు ?

ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ఆదిపరాశక్తి నిర్ణయించుకుంది. తర్వాత త్రిమూర్తులను పిలిచి... బ్రహ్మకు సృష్టికార్యాన్ని, విష్ణువుకు స్థితి కార్యాన్ని, శివుడికి లయ కార్యాన్నీ అప్పగించింది. తను మాత్రం సృష్టిలోనే ఉత్తమ సృష్టి అయిన మానవులకు పరిపుష్టిని కలిగించేందుకుగాను గోమాత రూపంలో భూమికి దిగి వచ్చింది.అందువల్ల గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమత నుండి వచ్చే పాలు, మూత్రం, పేడ అన్నీ పవిత్రమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాలు స్వచ్ఛతకు, అభివృద్ధికి చిహ్నం. అందుకే అవి పొంగిన ఇంట్లో అష్టయిశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ పొంగి పొర్లుతాయని అంటారు. కాబట్టే కొత్త ఇంట్లోపాలుతప్పక పొంగిస్తారు.....




సాక్షి ఆదివారం పుస్తకం నుండి సేకరించడమైనది.....




Wednesday, 9 July 2014

విభూతి ఎందుకు రాసుకుంటారు ?

విభూతి ఎందుకు రాసు
కుంటారు ?

నెయ్యి, పలురకాల వనమూలికలను కలిపి, ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి ఆహుతిగా సమర్పించినప్పుడు.... అందులో నుంచి వచ్చే భస్మమే విభూతి. విభూతిని సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. కొందరు భుజాలూ, ఛాతి, ఇతరత్రా శరీర భాగాలకు కూడా రాసుకుంటారు. దానికి కారణం... ఏదైనా వస్తువును కాల్చినప్పుడు బూడిదగా మారుతుంది. అయితే బూడిదను కాల్చితే మళ్లీ బూడిదే మిగులుతుంది తప్ప అది రూపాంతరం చెందదు.అందుకే అది అతి పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మత్రమే కాక... విభూతిని ఒంటికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.....

సాక్షి ఆదివారం పుస్తకం నుంచి సేకరించడమైనది.....

Tuesday, 8 July 2014

కుడివైపునకు తిరిగి మనం

Tuesday, 8 July 2014

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్
రలేవాలి ?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాలను గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధించినది.
         మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తల వరకు, తలనుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమవైపు నుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూలదిశగా మన శరీర కదలిక వల్ల  రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
         ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివైపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలపడం జరుగుతోంది.
         పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమ వైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు. కాబట్టి పెద్దల మాట పాటించడం ఉత్తమం.

శ్రీ కనకదుర్గ ప్రభ మాసపత్రిక నుండి సేకరించడమైనది.

kalala prayanam