Friday, 30 May 2014

దర్భలకి అంతటి పవిత్రత ఏలా వచ్చింది ?

శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు దానిపైన మందర పర్వతంతో దేవదానవులు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేలమీద పడగా అవి దర్భలుగా భూమినుండి మొలకెత్తాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని ఉంచింది ఈ దర్భలమీదే! అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడ కాబట్టి వీటికింతటి పవిత్రత.


సేకరణ : సాక్షి ఫ్యామిలీ

Bangaram



Wednesday, 28 May 2014

మా బావ పెళ్ళికి...

హలో... బాగున్నారా... మేము ఏమి చేస్తున్నామని చూస్తున్నారా?..మరేమో మా బావ పెళ్ళికి మేమే పెద్దలం. అందుకే ఇలా పసుపు దంచుతున్నాం. ఇంతకీ మీకు రోకలి అంటే తెలుసా.. మా నాన్నమ్మ దాని గురించి చెప్పడమే కాక..ఇలా మాతోనే పెళ్లి పనులు చేయిస్తున్నారు..చాలా అలసిపోయాం..నాకూ(నవ్య)..చిన్నగా ఉంది చూడండీ లక్కీకి తలో ఐస్ క్రీం ఇస్తారు కదూ...

Tuesday, 27 May 2014

భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలి ?

భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలి ?

భార్యాభర్తలు కలసి చేసే ప్రతి కార్యక్రమమాలలో భార్య భర్తకి ఎడమ వైపునే ఉండాలనేది ఎప్పటినుంచే వస్తున్న సాంప్రదాయం. భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలనేది ఎవరికీ తెలియని విషయం కాదు. శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీలక్ష్మీదేవికి తన హృదయంలో  స్థానం కల్పించాడు అందువలన అని కొందరనుకుంటే, మరికొందరు ఇలా అనుకుంటున్నారు. పూర్వకాలంలో కుడివైపు ఆయుధాలు ధరించేవారు. అవి ఆడవారికి తగులుతాయనే ఉద్దేశ్యంతో ఎడమవైపున  వుండేవారు. అదే అచారంగా ఇప్పటికీ అందరూ ఆచరిస్తున్నారు.



సేకరణ : ఆరాధన మాసపత్రిక

Sunday, 25 May 2014

చాలా ఆనందంగా ఉంది

జీవితంలో ప్రతిఒక్కరికి పండుగ రోజు వారి పుట్టినరోజే.. ఈ రోజు నా జన్మదిన వేడుకలను అంతర్జాల స్నేహితుల శుభసందేశాల మధ్య జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు విషెష్ చెప్పిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞాతాభివందనములు. 


Wednesday, 7 May 2014

లక్ష్మీ

ఏది
లక్ష్మీ ప్రదమైనది ?

 దిక్కులలో తూర్పు దిక్కు శుభప్రదమైనది. పురాణాలలో శ్రీభాగవతం గొప్పది. సముద్రాలలో పాలసముద్రం,నదులలో గంగానది, ఆశ్రమాలలో గృహస్తాశ్రమం గొప్పవి. కటాక్షాలలో కమలనివాసి అయిన శ్రీ లక్ష్మీ కటాక్షం గొప్పది.


సేకరణ ఆరాధనా ధార్మిక మాసపత్రిక నుంచి...

Sunday, 4 May 2014

మరిమీరో....

మిత్రమా....ఓటు మన హక్కు..

అందరం ఓటు వేద్దాం

నిజాయితీ పరుడిని,నిస్వార్థపరుడైన నేతలను ఎన్నుకుందాం. మన భవిష్యత్ ను మార్చుకుందాం.


నేను ఓటు వేస్తా..మరిమీరో....