Saturday, 12 April 2014
Monday, 7 April 2014
Friday, 4 April 2014
వారణాసి
హాయ్ ఫ్రెండ్స్..ఎలా ఉన్నారు..
మీతో మాట్లాడి చాలా రోజులయ్యింది కదూ.. ఎందుకంటే మా కుటుంబసభ్యులందరం వారణాసికి వెళ్లాము. ఆ విషయాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను. జన్మలో ఒక్కసారి కాశీపట్టణం వెళ్లాలంటారు మన పెద్దలు. కాశీ విశ్వేశ్వరుడి దయవల్ల ఈ జన్మలో నేను వెళ్లివచ్చాను. అబ్బో చాలా పెద్ద నగరం. అంతా చూడాలంటే ఈ జన్మ సరిపోదు. కానీ మేము ఉన్న ఐదు రోజుల్లో కొన్ని మాత్రమే చూడగలిగాము. మెదటి మూడు రోజులూ మామయ్యగారి కర్యక్రమముతో గడిపాము. నాల్గవ రోజు పొద్దున్నే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం దివ్యంగా జరిగింది. ప్రయాగకు వెళ్లి వచ్చే సరికి రాత్రి ఎనిమిది అయ్యింది. ఇక చివరి రోజు మా ప్రయాణం రాత్రి 11గంటలకు. పొద్దున్న 8గంటలకు దర్శనంకి బయలుదేరాము. 3కిలోమీటర్ల దూరంలో లైను ఉంది. పిల్లలకు ఫలహారం పెట్టి లైనులో నిల్చున్నాము. దర్శనం అయ్యేసరికి 11గంటలు అయ్యింది. కాశీ విశాలాక్షి, కాశీ అన్నపూర్ణమ్మను దర్శించుకిని బయటకు వచ్చేసరికి సరిగ్గా 11-30గంటలు. ఇక ఈరోజు కూడా మణికర్ణికా ఘాట్ లో స్నానం చేయలేం అనుకున్నాం. అన్ని సందులు తిరుగుతూ ఉన్నమాకు శివుని దయ వల్ల ఘాట్ కు దారి కనిపించింది. 12గంటలకు మణికర్ణికా ఘాట్ లో ముక్కోటి దేవతలు ఉంటారంట. ఆ సమయంలో స్నానం చేస్తే ఎంతో మంచిదని , స్నానం చేసి రూంకి వెళ్లేసరికి 1గంట అయ్యింది. భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయ్యి షాపింగ్ చేసాం. ఆ రోజు ఆదివారం కావటంతో షాపులు తక్కువగా ఉన్నాయి . బనారస్ చీరలకు ఫేమస్ కదా అందికని కొన్ని చీరలను కొనుక్కొని , పిల్లలకు బొమ్మలు, గాజులు తీసుకుని బయట పడేసరికి రాత్రి 9గంటలు అయ్యింది. అక్కడితో కాశీ పట్టణానికి వీడ్కోలు పలికి విజయవాడకు ప్రయాణం అయ్యాము. చాలా ప్రదేశాలు చూశాము. వాటి గురించి మళ్లీకలిసినప్పుడు చెబుతానేం...

Subscribe to:
Posts (Atom)